Union Cabinet approves Jamili election: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ కాసేపటి క్రితమే ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. కాగా.. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం గతేడాది కమిటీ వేసింది. మొత్తం 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై మాజీ రాష్ట్రపతి కమిటీ సభ్యులతో చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.