Trending Now

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒక్కటే..

డిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణను ATM గా మార్చారు..

మూడోసారి ప్రధానిగా మోడీనే..

రఘునందన్ ను పార్లమెంట్‌కు పంపండి..

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 25: కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సిద్దిపేట బీజేపీ విశాల జనసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి కాంకుంటే ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ విశాల జన సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు. గత పది సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పరిష్కరించినట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, కాశ్వీర్ సమస్యకు పరిష్కారం చూపినట్లు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు గడవక ముందే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణను ఏటీఎంగా మార్చారని మండిపడ్డారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.తెలంగాణ సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అన్నారు. ఎంఐఎంకు భయపడి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17 వియోచన దినోత్సవం జరుపుతామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లబ్ది చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మోడీ మూడో సారి ప్రధాని అయిన వెంటనే తెలంగాణలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం

ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం..

కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విశాల జన సభ పేరిట ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పరిష్కరించినట్లు తెలిపారు.అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఢిల్లీ కి తెలంగాణ రాష్ట్రంను ఏటీఎంగా మార్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే అన్నారు. కాలేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు విచారణ జరపలేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

నయవంచనకు మారుపేరు కాంగ్రెస్.. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు
స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం 2 లక్షల రైతు రుణమాఫీ, పెన్షన్ రూ.4వేలకు పెంపు
వంటి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించింది సీఎం రేవంత్ రెడ్డి కాదా అన్నారు. మెదక్ పార్టమెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్ర మంత్రి వర్గంలోకి ముదిరాజ్ లను తీసుకుంటానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు నుంచి గెలిచిన ముదిరాజ్ ఎమ్మెల్యేను ఎందుకు మంత్రి వర్గంలోకి తీసుకోలేదన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీని ఓడించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులు విమానంలో కుట్రలు పన్నారన్నారు. ఎంపీగా గెలిపిస్తే రూ.వంద కోట్ల నిధితో అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న మూడేళ్లలో మెదక్ జిల్లాకు చేసిందేమిటో చెప్పాలన్నారు.

మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇలా జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి దని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటాన్ చెరులో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైన వ్యక్తి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అని దుయ్యబట్టారు. ఈ సభలో బీజేపీ మల్కజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ఆకుల విజయ, బీజేపీ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, గోదావరి అంజిరెడ్డి, తొడుపు నూరి వెంకటేశం, వేణు , ఇర్రి ఉమా, కానుగంటి శ్రీనివాస్, మార్కండేయ, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News