హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: పాతబస్తీలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నగరానికి చేరుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో ఆయన ఆటోలో ప్రయాణించారు. జనాలతో ముచ్చటిస్తూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ కేంద్రమంత్రి అయి ఉండి ఇలా సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో ప్రయాణించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.