Trending Now

తడిసి ముద్దయిన వరి ధాన్యం..

కల్లాల వద్దనే కన్నీళ్ల పర్యంతమైన రైతులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 15 : నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాలలో అకాల వర్షాలు రైతన్నలలో ఆందోళనలను మొదలెట్టెయ్.. మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వాన రైతన్నలలో దుఖాన్ని మిగిలించింది. అష్ట కష్టాలు పడి వరి ధాన్యము పండించి ధాన్యం కోలుగోను కేంద్రాలకు తరలించిన ఆ రైతులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద, మామడ, సారంగాపూర్, దిలావర్ పూర్, సోన్ నిర్మల్ మండలంలలో కురిసిన వర్షాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యాన్ని తడిసి ముద్ద చేశాయి. వందలకుంటలలో వరి ధాన్యం వర్షాలతో ముద్దాయి చేతువు రాకుండా పోయింది.

సంబంధిత శాఖల అధికారులు ఇచ్చిన సూచనలు ఆదేశాల మేరకు నిర్ణీత కాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన తగిన విధంగా నిలువల భద్రతకు సౌకర్యాలు లేకపోవడంతోనే కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం నాని ముద్దాయి పనికిరాకుండా పోయిందని రైతులు కన్నీళ్ల పర్యంతమవుతు వాపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం విక్రయ సమయంలో నాని ముద్దాయి కళ్ళముందే పాడవడంతో వారి దుఖం మోయలేని భారంగా మారింది. బుధవారం ఉదయం నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరి చేనులలో నిల్వ ఉంచిన వరి ధాన్యం పాడవడానికి చూస్తూ వారు ఆందోళన చెందుతున్నారు.

ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలి : నిర్మల్ డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి

వాతావరణం వస్తున్న మార్పుల దృష్ట్యా సంబంధిత వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అధికారులు సిబ్బంది ధాన్యాన్ని సరైన రీతిలో కొనుగోలు చేసి నిర్ణీత కాలంలో గోదాములకు తరలించాలని నిర్మల్ డి ఆర్ డి ఏ పి డి విజయలక్ష్మి సూచించారు. మంగళవారం నిర్మల్ జిల్లాలోని సోన్ ,నిర్మల్ రూరల్, లక్ష్మణ్ చాంద తదితర మండలాల లోని పలు గ్రామాలలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అకాల వర్షాల కారణంగా పాడైన వరి ధాన్యాన్ని పరిశీలించారు. వర్షాల కారణంగా ధాన్యం నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎందుకు సంబంధించిన నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు సూచనల మేరకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ధాన్యం నిల్వలను అత్యంత వేగంగా సంబంధిత ప్రాంతాల గోదాములకు తరలించాలని సూచించారు.

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి.. కోసారావు (రైతు లక్ష్మణ్ చాంద)

అకాల వర్షాల కారణంగా తడిసిపోయి పనికి రాకుండా పోయిన వరి ధాన్యమును ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలకు సూచించినట్లే తగ్గిన సమయంలో ధాన్యాన్ని తీసుకెళ్లిన సమన్వయ లోపంతో వారు గోదాములకు తరలించకపోవడంతో దాన్యం మొత్తం నాని ముద్దైందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల ముందస్తు సూచనలు జాగ్రత్తలు లేకపోవడం కారణంగానే ఇలా ధాన్యం వర్షాలతో నాన్ని ముద్దై రైతులు నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.

Spread the love

Related News

Latest News