Trending Now

ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల ‘బడిబాట’ కార్యక్రమం

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 7: పట్టణంలోని 6 నెంబర్ ఉర్దూ మీడియం పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడి బాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సిద్దిపేటలోని వార్డు నెం.20, 21లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ ల కోసం సిద్దిపేటలోని అన్ని ఉర్దూ మీడియం మదర్సాల అధికారులతో ఇంటింటికి సామూహిక అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించారు , ఇందులో పిల్లల అడ్మిషన్లు, విద్య యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనం గురించి వివరించారు. ప్రభుత్వ ప్రాథమిక అధ్యాపకులు మాట్లాడుతూ పిల్లల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని, తెలంగాణా అమలులో ఉన్న పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాసిర్ పురా ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు, ఫయాజ్ అహ్మద్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ సయ్యద్ వహీదుద్దీన్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లింగం లాంగ్వేజ్ పండిట్ తెలుగు అర్షియా సిరాజ్ భాషా పండిట్ ఉర్దూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ ఉర్దూ మీడియం అధ్యక్షులు శ్రీ సయ్యద్ నిజాముద్దీన్ ప్రభుత్వ ప్రాథమిక 2 పాఠశాల నెం. 2 నసీర్‌పురా మదర్సా అధ్యక్షుడు శ్రీ సయ్యద్ రషీదుల్లా హుస్సేన్ మహమ్మద్ అయూబ్ అహ్మద్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల షేర్పురా మదర్సా అధ్యక్షురాలు శ్రీమతి సుహ్రా సుల్తానా సాజిద్ CRP శ్రీమతి భాగ్య లక్ష్మి CRP హుజా ఇతర మద్రాస్, చైర్‌పర్సన్ ఘౌసియా బేగం సాహిబాతో తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News