Trump on another presidential debate with Harris: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య కాలిఫోర్నియాలో బిగ్ డిబేట్ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన మొదటి డిబేట్ హోరాహోరీగా సాగింది.
అయితే కమలాహారిస్‌తో మరో చర్చకు సిద్ధమేనా? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన తడపడ్డాడు. కమలా హారిస్‌తో జరిగిన డిబేట్‌లో తానే గెలిచినట్లు భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. బహుశా.. తన మూడ్ బాగుంటే హారిస్‌తో రెండో డిబేట్‌కు సిద్ధమేనని వ్యాఖ్యానించారు. అంతలోనే ఇప్పుడే ఏమీ చెప్పలేను అంటూ మాట దాటేశారు.