బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి మార్చ్ 28: డబ్బు సంచులతోనే వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ టికెట్ కొన్నాడని, ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు పార్టీలు మారకుండా తల పది కోట్లు ఇచ్చి పార్టీ మారకుండా ఆపారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మెదక్ లో ఎగిరేది బీజేపీ జెండానేనని, గెలిచేది తానేనని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను అవమానించిన మంత్రి హరీష్ రావు ఆ పార్టీ నాయకులకు నేడు సిద్దిపేటలో అదే అవమానం జరుగుతుందని అన్నారు. అనంతరం మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులకు బీజేపీ జెండాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, రమేష్ గౌడ్, ప్రీవియషన్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొలను బాబు తదితరులు పాల్గొన్నారు.