ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీమిండియా సీనియర్ బ్యాట్స్ మెన్ దినేశ్ కార్తిక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 తర్వాత డీకే వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 అతడికి చివరి టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దినేశ్ కార్తిక్ గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, 2008 ఎడిషన్ నుంచి దినేశ్ కార్తిక్ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. 16 సీజన్లలో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4516 పరుగులు చేయగా.. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 141 క్యాచ్‌లు, 36 స్టంప్ ఔట్లు చేశాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.