ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని.. ఇటీవల మీడియా ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు అసంతృత్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడగా.. ఆయన ఇవాళ హనుమంత్ రావు ను వెంట తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి తో మీట్ చేయించారు. అన్ని విధాల అండగా ఉండనున్నట్టు సీఎం చెప్పిన్నట్లు సమాచారం. నాయకులందరినీ కలువుకుని వెళ్లాలన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి రేవంత్ రెడ్డికి, ఇప్పటి ముఖ్యమంత్రికి తేడా ఉందని.. ఆయన ఇప్పుడేమీ మాట్లాడటం లేదన్నారు. పోనీ తాను నేరుగా వెళ్లి రేవంత్ రెడ్డిని కలసి విషయం చెబుదామంటే, తనకు టైమ్ ఇవ్వడం లేదని ఇటీవల మీడియా ముందు వీహెచ్ రావు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.