ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 27 : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన బీడీలు చుట్టే కార్మికులు బీడీ ప్యాకర్స్ కు నెలసరి ఉద్యోగులు గంపబట్టి వారికి వేతనాలు పెరగడంతో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని, సోఫీ నగర్ లో గల బీడీ ఫ్యాక్టరీ ముందు టపాకాయలు పేలుస్తూ.. సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విజయోత్సవ సభ జరిగింది. ప్యాకింగ్ జిల్లా కార్యదర్శి కిషన్ అధ్యక్షతన జరిగిన.. ఈ సభ లో ముందుగా చర్చ లో పాల్గొన్న, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజన్నకు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కే. రాజన్న మాట్లాడుతూ.. కార్మికుల వేతనాల పెరుగుదల కార్మికుల సమిష్టి కృషి ఫలితంగా జరిగిందని కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చే బీడీ పరిశ్రమ రోజు రోజు నిర్వీర్యమైపోతుందని బీడీ కార్మికులకు పని లేక అతి తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వాలే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ, పురేగుర్తు ఫిక్టోరియల్ వార్నింగ్, పెట్టడంతో బీడీ పరిశ్రమ తగ్గిపోయి ఉపాధి దొరకక కార్మికులు అర్ధాకలితో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రత్యమ్యాయ ఉపాధిని చూపాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమలో జీవన భృతి రాని కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవన భృతి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని లేని ఎడలో త్వరలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పెరిగిన వేతనాలు మే నెల నుంచి అమలు జరుపబడతాయని 1000 బీడీకి రూ4-25పైసలు, బీడీ ప్యాకర్లకు నెలకు, రూ.3650 రూపాయలు నెలసరి ఉద్యోగులకు రూ. 1700 రూపాయలు పెరిగినట్లు పెరిగిన వేతనాలు తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మందికి అమలు జరుగుతాయని చెప్పారు. ఈ అగ్రిమెంటు 2026 సంవత్సరం వరకు అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు కే లక్ష్మి, గంగామణి ,రాజేందర్, ఎల్లయ్య, రవి, వెంకటి, లక్ష్మణ్, కే. రాజు మురళి, చిన్నయ్య, రవి, కమల, కవిత నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.