ప్రతిపక్షం, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం మూవీ టీజర్‌ను విడుదల చేశారు. మిడిల్ క్లాస్ బయోపిక్‌ను తలపించేలా టీజర్‌ను రూపొందించారు. టీజర్ చివర్లో ‘హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైకుపై దింపుతావా? అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా’ అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.