ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. గీతగోవిందం లాంటి సూపర్ హిట్ తరువాత విజయ్, పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ఫ్యామిలీ స్టార్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, బాధ్యతలు, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్ ను నింపేశారు.