Vijayawada Floods Chandrababu is in the Collectorate till 2 midnight: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు బెజవాడ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. సింగ్ నగర్ లో మొత్తం 16 డివిజన్లు నీట మునిగాయి. ఈ మేరకు విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు సీఎం చంద్రబాబు కలెక్టరేట్ కార్యాలయంలోనే ఉన్నారు.
ఈ మేరకు సహాయక చర్యలు, వరద నిర్వహణను పర్యవేక్షించారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు సీఎం వెళ్లారు. అక్కడే కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేశారు. సీఎంతోెపాటు మంత్రులు, అధికారులు ఉన్నారు. మరోవైపు 160కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్షమందికి పైగా వరద బాధితులకు ఆశ్రయం కల్పించారు.