MS Dhoni: విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ ప్లేయర్: ఎం.ఎస్. ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్ అని కొనియాడారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని.. కోహ్లీతో ఉన్న రిలేషన్‌ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేం 2008-09 నుంచి కలిసి ఆడాం. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉంది. కాబట్టి నేను కోహ్లీకి పెదన్ననా?.. సహచర ఆటగాడినా? మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు. కానీ మేం ఇద్దరం సహచర ఆటగాళ్లం. మా ఇద్దరిలో ఎవరూ సుదీర్ఘ కాలం ఆడారనేది కూడా మీకు తెలుసు. ప్రపంచ క్రికెట్‌ విషయానికి వస్తే మాత్రం విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు.’అని ధోనీ చెప్పుకొచ్చారు.

ధోనీ సారథ్యంలోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో విఫలమైన విరాట్ కోహ్లీకి ధోనీ పూర్తిగా అండగా నిలిచారు. ధోనీ సహకారంతో అవకాశాలు అందుకున్న కోహ్లీ.. అంచెలంచెలుగా ఎదిగారు. అత్యుత్తమ బ్యాటర్‌గా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నారు. ధోనీ జట్టులో ఉండగానే.. అతని గైడెన్సీలోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నారు.

Spread the love

Related News