Trending Now

హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా విశాఖ శ్రీ శారదా పీఠం..

జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్నిశనివారం సందర్శించారు. ఆలయ ఈవో, అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారు ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి తరువాత వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని పీఠాధిపతుల వారికి అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పీఠాధిపతులు వారు స్వయంగా ప్రసాద వితరణ చేశారు.

అనంతరం పీఠాధిపతులు వారు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లారు. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ఆలయానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. అనంతరం భక్తులనుద్దేశించి పీఠాధిపతుల వారు ఆశీర్వచనాలు అందజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశాఖ శ్రీ శారదా పీఠం తెలంగాణలో అనేక సందర్భాల్లో పర్యటించిందని స్వామివారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో, కేవలం హైదరాబాద్ జంట నగరాల్లోనే విశాఖ శ్రీ శారదా పీఠం యొక్క ఆలయాలు 13కు పైగా ఉన్నాయి అని, ఈ ఆలయాల ద్వారా నిరంతరం, ఎప్పటికప్పుడు సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని స్వామివారు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు భక్తులు అందరూ కూడా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని స్వామివారు పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News