Trending Now

Vishnu: కొండా సురేఖ వ్యాఖ్యలపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటు వ్యాఖ్యలు!

‘Maa’ president Manchu Vishnu’s harsh comments on Konda Surekha’s comments: సమంత – నాగ చైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని యావత్ సినీ లోకం ఖండిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించారు. ‘సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల కారణంగా సినిమా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మా పరిశ్రమ ఇతర రంగాల మాదిరిగానే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తోంది. కానీ, ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం అవాస్తవ కథనాలను వాడటం చాలా నిరాశ కలిగిస్తోంది. మేం నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబసభ్యులు టార్గెట్‌ అవడం లేదా వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావడాన్ని ఇష్టపడరు. అదేవిధంగా మేం కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.

Spread the love

Related News

Latest News