Trending Now

ఓటు హక్కు వినియోగం మనందరి బాధ్యత..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

ప్రతిపక్షం, సంగారెడ్డి ప్రతినిధి, మే 13: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు తల్లిదండ్రులు నిర్మల్, రాధా స్మారక విగ్రహాల వద్ద పూలమాలలతో నివాళులర్పించి, ఆశీర్వాదం తీసుకున్నారు. తన స్వగ్రామం పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధి చిట్కుల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో నీలం మధు ఓటు వేశారు. ఆయన సతీమణి కవితతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునున్నారు. ఈ సందర్భంగా నీలం మధు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు బాధ్యతాయుతమైందని, అలాంటిది ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళని కూడా పరిశీలించమన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కు ఓటర్లు భారీ ఎత్తున విచ్చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎన్నికల అధికారులు కూడా ఓటర్లకు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ప్రజా పాలనను ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని నీలం మధు ధీమా వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News