Vyjayanthi Movies Pledges ₹25 Lakh to AP: ఏపీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వణికిపోయింది. ఈ భారీ వర్షాలకు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏర్పడిన వరదల్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. వరద బాధితులకు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25లక్షల విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించింది. రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
‘ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత’. అని పేర్కొంది. అలాగే ఆయ్ మేకర్స్ సైతం వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సోమవారం నుంచి వారం వరకు ఆ సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్ లో 25 శాతం జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.