Trending Now

మార్చి 2న ‘వ్యూహం’ రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ప్రతిపక్షం, సినిమా: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘వ్యూహం’ విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఆర్జీవీ ఓ ట్వీట్ లో వెల్లడించారు. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అంటూ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను ఆది నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి.

Spread the love

Related News

Latest News