ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వరంగల్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మారేపల్లి సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ నాయకులతో సుదీర్ఘ భేటీ అనంతరం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.