ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని, కట్టుబడి ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. సంగారెడ్డి సభలో మాట్లాడిన ఆయన.. ”నిన్న ఆదిలాబాద్ నుంచి రూ. 56 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించాం. ఇవాళ సంగారెడ్డి నుంచి రూ. 9 వేల కోట్ల విలువైన పనులను శ్రీకారం చూట్టాం. రాష్ట్రాల అభివృద్ధి.. దేశ అభివృద్ధి అని నమ్ముతాం. దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రం బేగంపేట్ లో ఏర్పాటు చేశాం” అని తెలిపారు.