Trending Now

మహిళా సాధికారతను పెంపొందిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

ప్రతిపక్షం, మంథని రామగిరి మే 02 : మహిళ సాధికారతను పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ని గెలిపించాలని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఉపాధి హామీ మహిళ కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సంక్షేమం కొరకు వంద రోజుల ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరుతో అమల్లోకి తెచ్చిందనీ, ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని పెంచుతామన్నారు. అదే విధంగా గ్రామాల్లోనీ మహిళలకు సూక్ష్మ, కుటీరా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమగు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసి, ఆర్థిక వనరులు సమకూర్చి మహిళా సాధికారతను పెంపొందించే చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు.

అదే విధంగా రామగిరి ఖిల్లా పరిసరాలను ఉద్దేశించి ఖిలాపై ఉన్న పురాతన కట్టడాలు, నీటి కొలనుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో రామగిరి ఖిల్లాను గొప్ప పర్యాటక క్షేత్రంగా లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే బేగంపేట గ్రామం నుండి ఖిల్లా వరకు రహదారినీ మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని యువతి యువకుల గుర్తి నైపుణ్య శిక్షణ కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో ఇప్పటివరకు ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే రూపకల్పన చేసి అమలయ్యాయని, ప్రజల సంక్షేమం దేశ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అందుకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య, రామగిరి ఎంపీపీ ఆరెళ్ళీ దేవక్క కొమురయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోడ్డ బాపు, పాక్స్ చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు, మంథని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, సెంటినరీ కాలనీ టౌన్ అధ్యక్షుడు కాటం సత్యం, నాయకులు ముస్త్యాల శ్రీనివాస్, బండారి సదానందం, ఎరుకల బాబురావు, మైధం వరప్రసాద్, ఏల్లే రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News