Trending Now

కరీంనగర్ వెలిచాలదే..

కరీంనగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

రిజర్వేషన్లను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది

మత విద్వేషాలు మనకొద్దు

మంత్రి పొన్నం ప్రభాకర్

భారీ జనప్రదర్శన, బైక్ ర్యాలీ

ప్రతిపక్షం, ప్రతినిధి, కరీంనగర్ :
కరీంనగర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. గీతాభవన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ నగరంలో ప్రధాన కూడళ్ళ మీదుగా కొనసాగింది. తెలంగాణ చౌక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు లుమాట్లాడుతూ కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని తెలియజేశారు. నిరంతరం ప్రజలకు సేవ సేయడం నా కర్తవ్యం అన్నారు. ప్రజలు సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ ఎన్నికలు దేశంలో ప్రధాని ఎవరు ఉండాలి అనే దాని కోసం జరుగుతున్నాయని, దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. మే 13న జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావు ను అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ కు మద్దతుగా యువకులు బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జనంతో తెలంగాణ చౌరస్తా కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News