West Indies won by 30 runs: దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల్లో భాగంగా వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ ఇరు జట్ల మధ్య మంగళవారం జరగనుంది.
తరుబా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. షాయ్ హోప్(41), రోవ్‌మన్ పావెల్(35) పరుగులు చేశారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 19.4 ఓవర్లకు 149 పరుగులకే ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్(44) రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్, రొమారియో షెపర్డ్ చెరో మూడు వికెట్ల పడగొట్టారు. దీంతో 30 పరుగులతో తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.