ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వాట్సాప్ ‘గ్రూప్ చాట్ ఈవెంట్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రూప్‌లలోని సభ్యులు ఈవెంట్స్‌ను క్రియేట్ చేసి ఇతరులను ఆహ్వానించవచ్చు. ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచవచ్చు. దీని వివరాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. తొలుత కమ్యూనిటీ గ్రూప్‌లకోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు సాధారణ గ్రూప్‌లకూ విస్తరించారు. ఇది యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి రానుంది.