Trending Now

హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం..!

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 14 : కరీంనగర్ పార్లమెంట్ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,47,701 ఉండగా.. 1,91,804 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ తో పాటు హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, చిగురుమామిడి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్, మండల కేంద్రాల్లో గ్రామాల్లో క్రాస్ ఓటింగ్ భారీగానే జరిగిందని సమాచారం. క్రాస్ ఓటింగ్ తో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు తలపడిన చివరికి బీఆర్ఎస్ ఓట్లు భారీగానే క్రాస్ అయినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి లాభం.. అనేది ఓటర్ నాడీ తెలియని పరిస్థితి నెలకొంది.

నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో బీజేపీకి భారీగానే ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ కి అత్యధిక ఓట్లు పోలైనట్లు సమాచారం. బీఆర్ఎస్ కు పడవలసిన ఓట్లు కాంగ్రెస్ కి పడ్డట్టు సమాచారం. కోహెడ మండల కేంద్రంలో బీజేపీకి అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. నియోజకవర్గంలోని మిగతా మండల కేంద్రాల్లో బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు భారీగానే క్రాస్ కటింగ్ జరిగినట్లు సమాచారం. ఎస్టీ తండాల్లో అక్కన్నపేట మండలంలో బీజేపీకే ఎస్టీలు సహకరించారని ఓట్లు వేశారని తెలుస్తుంది. దీంతో ఆయా పార్టీల నాయకులు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలు తెలుసుకుంటున్నారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటట్టు దళిత వర్గాలు మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ కు భారీగానే సహకరించాలని ఓట్లు వేశారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి భారీగా ప్రచారం చేసిన చివరి రోజు మాత్రం నాయకులు, కార్యకర్తలు అంతగా ఓటర్లను ప్రభావితం చేయలేదని సమాచారం. దీంతో ఆ పార్టీకి పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయాని సమాచారం. నియోజవర్గంలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారో క్రాస్ ఓటింగ్ ఏ పార్టీకి లాభం చేకురుస్తుందో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేసి చూడాల్సిందే.

Spread the love

Related News

Latest News