ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భర్తను కట్టేసి కొట్టి చంపిన ఘటన కరీంనగర్ జిల్లాలోని సుభాష్ నగర్ లో ఇవాళ చోటు చేసుకుంది. రోజు తాగి వచ్చి.. తరచు గొడవ చేస్తున్నాడని నెపంతో భర్త హేమంత్ ని భార్య రోహితి కొట్టి చంపింది. ముందుగా పడుకున్న భర్తపై నీళ్లు పోసి.. ఆపై కొట్టడంతో.. హేమంత్ గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ.. తెల్లవారు జామున మృతి చెందాడు. రోహితి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికురాలుగా పని చేస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.