Trending Now

హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..

ప్రజాహిత యాత్రలో బండి సంజయ్

ప్రతిపక్షం, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 697 కోట్లు మోదీ ప్రభుత్వం వెచ్చించిందని హుస్నాబాద్ మండలానికి కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధుల వివరాలను ప్రజాహిత యాత్రలో భాగంగా ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు రోడ్డు పనులతోపాటు హుస్నాబాద్ లో రోడ్డ కోసం దాదాపు కేంద్రం 660 కోట్లు ఖర్చు చేసిందని మొక్కల పెంపకానికే 191 కోట్లకు పైగా నిధులిచ్చినమన్నారు. ఆ నిధులన్నీ ఎటుపోయినయో లెక్క తేల్చాలని అన్నారు. పొన్నం ప్రభాకర్ ఏనాడైనా మీకోసం కొట్లాడారా.. అని గౌరవెల్లి బాధితుల పక్షాన కొట్లాడింది నేనని. గౌరవెల్లి బాధితులకు అండగా నిలిచి భరోసా ఇచ్చింది నేనని అన్నారు బండి సంజయ్.

హామీల అమలుపై ప్రశ్నిస్తే దాడులు చేయించడం వెనుక ఉద్దేశమేమిటని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు15 వేలు, మహిళలకు నెలనెలా 2,500, ఆసరా పెన్షన్ ను నాలుగు వేలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మమ్ముల్ని గెలుకుడు మొదలు పెడితే మీకు ఇరవై రోజులే డెడ్ లైన్ అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News