Trending Now

కాంగ్రెస్‌కు హామీల గండం..?

పత్తలేని రూ.2 లక్షల రుణమాఫీ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్​కు అయిదు మాసాల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గండం లోక్​సభ ఎన్నికల్లో వెంటాడుతోంది. గత ఎన్నికల్లో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ హామీలు అమలు చేయడం లేదన్న విషయాన్ని ఇటు బీజేపీ, అటు బీఆర్​ఎస్​ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా కరెంటు కోత, ఎండిపోయిన పంటలంటూ బీఆర్​ఎస్​ ఆగ్రనేత ఎన్నికల బస్సు యాత్రల్లో పేర్కొంటున్నారు. బస్సు యాత్రకు జనం భారీగా తరలి వస్తుండడంతో ఇటు అధికార కాంగ్రెస్​తో పాటు విపక్ష బీజేపీకి సైతం భయం పుట్టుకుంది. ఓటర్లలో నిశబ్ధవిప్లవం మొదలైందని ఇది బీఆర్ఎస్ కు కలిసొస్తుదని ఆ పార్టీ నేతలు భరిసగా ఉన్నారు. ఎన్నికల ప్రకటనప్పుడు బిఆర్ఎస్ సప్పగా ఉంది. కేసీఆర్ బయటికి వచ్చి ప్రచారం ప్రాంభించడం. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడం లేదంటూ చేస్తున్న ప్రచార్శం వల్ల కాంగ్రెస్ కు మహినెస్ అయ్యిందంటున్నారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణాలను మాఫీచేస్తుంది. ఇప్పటి వరకు లక్ష రుణం తీసుకున్న వారు ఇంకో లక్ష తీసుకోండి. లక్ష రుణమాఫీ అయిన వారు రెండు లక్షలు రుణం తీసుకోండి. డిసెంబరు 9న అన్నీ మాఫీ చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే ప్రకటించాడు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా ఆ దిశగా చర్యలు లేవు. ఆ ఊసెత్తడం కూడా మానేశారు.

అయితే హఠాత్తుగా నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. రుణమాఫీకి రూ.33 వేల కోట్లు అవసరం పడతాయని అంచనా. ఆగస్ట్ నెల కాదు అయిదేళ్ల పాలనలో కూడా రుణమాఫీ సాధ్యమయ్యే పని కాదు అన్నది ఆర్థికవేత్తల వాదన. మరి హఠాత్తుగా రేవంత్ రుణమాఫీ ప్రస్తావన ఎందుకు తెచ్చాడన్న ప్రశ్న మొదలయింది. గత ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు ఇచ్చేది. కాంగ్రెస్ ఎకరాకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు అని ప్రకటించింది.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఫిర్యాదుతో విడుదలకు సిద్ధంగా ఉన్న రైతుబంధు నిధులను ఎన్నికల కమీషన్ నిలిపివేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా రైతుబంధు నిధులు రైతుల ఖాతాలకు చేరలేదు. దీని మీద ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ పలు మార్లు ప్రకటన చేశాడు. మార్చి 31 వరకు అందరికీ ఇస్తాం అని చెప్పాడు. ఏప్రిల్ మూడో వారం వచ్చినా రైతుబంధు ఊసు లేదు. ఇక కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం అని ప్రకటించారు. ఆ విషయం గురించి కూడా ఏ కాంగ్రెస్ నేత నోరెత్తడం లేదు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుకు రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ క్షేత్ర స్థాయి నుండి నివేదిక తెప్పించుకున్నారని సమాచారం. రైతుబంధు ఇవ్వక పోవడం, రుణమాఫీ ఊసెత్తకపోవడం, కళ్యాణలక్ష్మిని పక్కన పెట్టడం, ఫించన్లు పెంచకపోవడం, సాగునీళ్లు ఇవ్వక పోవడం మీద రైతులు గుర్రుగా ఉన్నారన్న విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు రేవంత్ రైతులను శాంతింపజేసేందుకు రుణమాఫీ ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది.

అయితే రుణమాఫీ విషయంలో కట్ ఆఫ్ తేది ప్రకటించకపోవడం, 33 వేల కోట్ల నిధులు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేకపోవడంతో రేవంత్ ప్రకటన మీద నీలినీడలు కమ్ముకున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం మినహా మరే పథకం విషయంలోనూ సరైన విధానం, పారదర్శకత లేకపోవడంతో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. రేవంత్ ప్రకటన ఎంత వరకు పనిచేస్తుందో వేచిచూడాలి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పై వ్యతిరేకత ను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నామ్ చేస్తున్నది ఇది ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడస్లిందే మరీ!

Spread the love

Related News

Latest News