Trending Now

నవీపేట్ మండలంలో మహిళ దారుణ హత్య

ఘటనా స్థలాన్ని పరిశీలించిన
సీపీ సాయి చైతన్య

ప్రతిపక్షం ప్రతినిధి, నిజామాబాద్, నవంబర్ 01 :
జిల్లాలోని నవీపేట్ మండలంలో ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. మండలంలోని ఫకీరాబాద్ మిట్టాపూర్​ మార్గంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. మహిళను వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి మొండాన్ని పడేశారు. ఆమె చేయిని సైతం దుండగులు మణికట్టు వరకు నరికి వేశారు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నవీపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News