Trending Now

Japan: వారానికి నాలుగు రోజులే పని..జపాన్‌లో కీలక ఆదేశాలు

Japan proposes four-day working week: జపాన్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో మరింత మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపింది.

కాగా, వాస్తవానికి ఈ విధానం మూడేళ్ల క్రితమే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకుంది. కానీ చాాలా సంస్థలు అంగీకరించపోవడంతోపాటు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ విధానంతో అభివృద్ధి విషయంలో జపాన్ వెనుకపడే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. 2021లోనే ఈ విధానంపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ కేవలం 8 శాతం సంస్థలే అమలులోకి తీసుకొచ్చాయి. తాజాగాచ మరోసారి ఉత్తర్వులు జారీచేసింది.

Spread the love

Related News

Latest News