Trending Now

జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి..

మంత్రి దామోదర్ రాజనర్సింహ..

ప్రతిపక్షం, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 16: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కంచుకోట జహీరాబాద్ అని వెల్లడించారు. మాజీ మంత్రి, దివంగత నేత ఫరీదుద్దీన్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారితో ఉన్న అనుబంధాన్నిమంత్రి గుర్తు చేసుకున్నారు. జాతీయస్థాయిలో కొన్ని పార్టీలు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులాలపరంగా, ప్రాంతాల పరంగా, మతపరంగా రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేస్తే దేశానికి మంచిది కాదన్నారు. రాజకీయాలు సేవా భావంతో ఉండాలని, నిబద్ధతతో ఉండి ఆత్మగౌరవంతో గతంలో రాజకీయాలు ఉండేవన్నారు. దేశంలో పేదరికం ప్రతి వర్గంలో ఉందన్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి సమక్షంలో BRS పార్టీకి చెందిన జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలికి పార్టీ కండువాను కార్యకర్తల మెడలో వేసి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షేత్కర్, మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఎఫ్ డి సి చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, సుభాష్ సేట్, మాజీ చైర్మన్ తన్వీర్, ఫరూక్ సాబ్, షబ్బీర్ మియా, తాజ్ భాయ్, యూసుఫ్, ఖాదర్ తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News