ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వరల్డ్ ఎర్త్ డే ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఎర్త్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన కల్పించడం. పర్యావరణ ఉద్యమంలో సాదించిన ప్రగతిని మననం చేసుకోవడానికి ధరిత్రి దినోత్సవం(ఎర్త్ డే) జరుపుకుంటారు. భూమి యొక్క సహజ వనరులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందమైన, ఆహ్లదకరమైన భూమిని అందించడమే ఎర్త్ డే యొక్క లక్ష్యం.
ప్రపంచ ఎర్త్ డే 2024 థీమ్..
ప్రతి సంవత్సరం ప్రపంచ భూమి దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో దీని థీమ్.. ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్’ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం, దాని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం. 2023 సంవత్సరం థీమ్ “మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి”.
ఎర్త్ డే ఎలా ప్రారంభమైంది..?
1969లో యునెస్కో సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ తొలిసారిగా ఎర్త్ డే జరుపుకునే ఆలోచనను ప్రతిపాదించారు. ప్రారంభంలో, ఈ రోజును జరుపుకోవడం ఉద్దేశం భూమిని గౌరవించడమే. ఏప్రిల్ 22, 1970న మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో ఎర్త్ డే జరుపుకున్నారు. 1990లో, డెన్నిస్ హేస్ 141 దేశాలు పాల్గొన్న ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. 2016 లో ఎర్త్ డే వాతావరణ పరిరక్షణకు అంకితం చేయబడింది.