ప్రతిపక్షం, స్పోర్ట్స్: క్రికెట్ ఫీల్డ్‌లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతోంది. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ వృందా రతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా జి.ఎస్.లక్ష్మి చరిత్ర సృష్టిస్తే… ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కల్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్ క్యూరేటర్‌గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది.