YCP leader Kukkala Vidyasagar arrested: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ కోసం ఆరు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతని ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జెత్వానీ ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్‌ను ఏ1గా చేర్చారు. అతనితో పాటు మరికొందరు అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.



























