Telangana rewards Deepthi Jeevanji with Rs 1 crore: పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం ఆమెకు భారీ నజరానా ప్రకటించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అంతేకాకుండా పారాలింపిక్స్‌లో పార్టిసిపెంట్స్ కు కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజీ దీప్తి.. క్రీడల్లో రాణించేందుకు తన తండ్రి ఎకరం పొలాన్ని అమ్మడం విశేషం.