ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి.. శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు తనని వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
”11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు. రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు. రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. గతంలో నన్ను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారు. అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నా. రాజ్ నాకు ఎలాంటి సాయం చేయలేదు” ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.