EX CM YS Jagan Fire: చంద్రబాబు వంద రోజుల పాలన అంతా మోసమేనని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్‌మీట్‌లో జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదంటూ విమర్శించారు. గోరు ముద్దు గాలికి ఎగిరిపోయిందని, ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెనను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు.
రాష్ట్రంలో డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట అని విమర్శలు చేశారు. చంద్రబాబు వంటి అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బాబు కట్టుకథలు అల్లుతున్నారని చెప్పారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రాజకీయాల కోసం దేవుడ్ని వాడుకునే నైజం చంద్రబాబుది అన్నారు. తిరుమల లడ్డూలో నెయ్యి బదులు.. యానిమల్ ఫ్యాట్ వాడారని విష ప్రచారం చేస్తున్నారన్నారు.