టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీపై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడి కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని ఆరోపించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘నేను ధోనీని ఎప్పటికీ క్షమించను. ఆయన గొప్ప క్రీడాకారుడే కావొచ్చు.. కానీ, నా కుమారుడికి చేసిన అన్యాయం క్షమించరానిది. ప్రతిదీ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఇంకా నాలుగైదేళ్లు ఆడగలిగే నా కుమారుడి కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడు. అతడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు కూడా మరో యువరాజ్ రాడని అన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూనే.. దేశం కోసం ఆడి ప్రపంచ కప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్‌కు భారతరత్న ఇవ్వాలి’ అని అన్నారు.