ప్రతిపక్షం, వెబ్ డెస్క్: నిన్న ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు గంటసేపు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో మెటా అధినేత జూకర్ బర్గ్ భారీగా నష్టపోయారు. ఒక్క రోజులోనే దాదాపు 3 బిలియన్లు (రూ. 24 వేల కోట్లు) కోల్పోయారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. జూకర్ బర్గ్ నికర విలువ 176 బిలియన్లుకు చేరిందని తెలిపింది. అయితే ఆయన ప్రపంచంలో 4వ ధనవంతుడిగా కొనసాగుతున్నారు.