కిర్రాక్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ పేరు చెబితే చాలు.. టాలీవుడ్ మూవీ లవర్స్ అందరికీ టిల్లు క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. ఆ పాత్రలో ఆయన యాక్టింగ్ అంత ఇంపాక్ట్ చూపించింది. డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సిద్ధు ఫుల్లుగా వినోదాన్ని పంచారు. టిల్లు అంటే సిద్ధు, సిద్ధు అంటే టిల్లు అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో మరోసారి టిల్లు పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ ప్రేక్షకులను అలరించనున్నారు. మొదటి సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ కాగా… ఇప్పుడీ సినిమాలో మలయాళీ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 29న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో పాటు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. లవర్స్ డే సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో బెడ్ పై హీరోహీరోయిన్లు ఇచ్చిన లుక్ మతి పోగొడుతోంది. అనుపమ టూ రొమాంటిక్ గా కనిపిస్తోంది. వైట్ కలర్ పొట్టి డ్రెస్ లో ఉన్న అనుపమ రివర్స్ లో టిల్లును హగ్ చేసుకుంది. ఇక హీరో సిద్ధు ఇన్నోసింట్ కమ్ రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాలో అనుపమ యమా స్టైలిష్ గా నటించినట్లు తెలుస్తోంది. సిద్ధు- అనుపమ రొమాన్స్ ఈ సినిమాలో ఘాటుగా ఉండనున్నట్లు పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. లేటెస్ట్ పోస్టర్ వేరే లెవల్ లో ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ కు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అప్పట్లో ఫుల్ వైరల్ అయింది. బెడ్ పై టిల్లు ఉండగా.. తన ఒడిలో కూర్చొని అనుపమ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేసింది.హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో బుధవారం సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ ను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ తెలిపారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక టిల్లు సీక్వెల్ కూడా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.