ప్రతిపక్షం, సినిమా: బాలీవుడ్ ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ (59) గుండెపోటుతో కన్నుముశారు. కొన్ని రోజులుగా ఆయన ప్యాంక్రియాస్ వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం సడెన్ గా గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు బంధువులు వెల్లడించారు. ఈయన దాదాపు 50 టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లు, 11 సినిమాలు నటించారు. తమిళంలో అజిత్ నటించిన తునివు లోనూ కీలక సాత్ర పోషించారు.