Trending Now

రాజ్యసభ సభ్యులుగా రేణుకా చౌదరి, అనీల్​కుమార్​ యాదవ్​


ఏఐసీసీ జాబితా విడుదల
హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో:

కాంగ్రెస్​ అధిష్టానవర్గం త్వరలో మూడు రాష్ట్రాలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి మాజీ మంత్రి రేణుకాచౌదరితో పాటు యువజన కాంగ్రెస్​ నాయకుడు ఎం.అనీల్​కుమార్​ యాదవ్​ను ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం పలువురు నేతలు ప్రయత్నించారు. బుధవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఈ మేరకుజాబితాను విడుదల చేశారు. అలాగే కర్నాటక నుంచి అజయ్​మాకెన్​, డాక్టర్​ సయ్యద్​ నాసిర్​ హుస్సేన్చ జి.సి.చంద్రశేఖర్​ను ఎంపిక చేశారు. మధ్య ప్రదేశ్​నుంచి ఆశోక్​సింగ్​ను ఎంపిక చేశారు. అయితే తెలంగాణ నుంచి యువజన కాంగ్రెస్​కు చెందిన యువకుడు అనీల్​కుమార్​ను ఎంపిక చేయడంతో యువతకు కాంగ్రెస్​పార్టీ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లైంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడు బల్మూరు వెంకట్​కు అవకాశం కల్పించిన రాహుల్​, రాజ్యసభకు అనీల్​కుమార్​ను అవకాశం కల్పించడం విశేషం. రాజ్యసభ సభ్యత్వం కల్పించినందుకు ఏఐసీసీ అధినాయకురాలు సోనియాగాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్​గాంధీ, సీఎం రేవంత్​కు రేణుకాచౌదరి, అనీల్​కుమార్​ యాదవ్​ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Related News

Latest News