ఆర్టీసీ బస్సు కింద పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం..
ప్రతిపక్షం, తెలంగాణ: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ ఇంజినీర్‌గా ఆకుల సాయికృష్ణ (26) పనిచేస్తున్నాడు. బైక్‌పై డీఎల్ఎఫ్ వైపు వెళ్తుండగా అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనక టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.