Trending Now

Megastar: పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్, చిరంజీవికి సంబంధించిన ఓ అరుదైన ఫోటో కూడా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

‘కల్యాణ్‌ బాబు.. ప్రతీ సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను ఆంధ్ర ప్రజలు వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!’ అని రాసుకొచ్చారు.

Spread the love

Related News

Latest News