శృంగేరి జగద్గురువులు భారతీస్వామి దర్శించుకున్న సీఎం రేవంత్​

వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను స్వామికి తెలిపిన ముఖ్యమంత్రి


ప్రతిపక్షం స్టేట్​బ్యూరో, హైదరాబాద్, అక్టోబర్​28: హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన విధుశేఖర భారతీస్వామి వారికి వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను సీఎం రేవంత్​వివరించారు. సీఎం వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు.

Spread the love

Related News

Latest News