పద్మశ్రీతో మరో మైలురాయి.. భావోద్వేగ పోస్ట్ చేసిన రోహిత్ శర్మ

ప్రతిపక్షం, జూన్ 24: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకోవడం తన జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నారు.

“జూన్ 23 నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. 19 ఏళ్ల క్రితం భారత జట్టు తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రోజు ఇదే. భారత జట్టు టోపీతో ప్రారంభమైన నా ప్రయాణానికి ఇప్పుడు పద్మశ్రీ రూపంలో మరో గర్వకారణమైన అధ్యాయం చేరింది” అని రోహిత్ శర్మ తెలిపారు.

పద్మశ్రీ పురస్కారంతో ఉన్న చిత్రాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. 2007 జూన్ 23న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్, ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకోవడం విశేషంగా నిలిచింది.

Spread the love

Related News

Latest News