హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీఎస్పీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కే.చంద్రశేఖర్‌రావుతో భేటీలో పొత్తుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఎస్సీకి ఏ స్థానం కేటాయిస్తారు? లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ పోటీ చేస్తుందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పొత్తుపై ఇరు పార్టీల అధ్యక్షుడు ఉమ్మడి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.