ప్రతిపక్షం, జూలై 20: హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో తోటి మహిళా ఐపీఎస్ అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు, ప్రచారంలో ఉన్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. చివరికి నిజమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వార్తలు ప్రచురించే ముందు మీడియా సంస్థలు వాస్తవాలను పూర్తిగా ధ్రువీకరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


















