విమర్శలు లేకుంటే ఆటలో మజా ఉండదు.. ఆటపైనే నా దృష్టి: రోహిత్ శర్మ

ప్రతిపక్షం, జూలై 20: లార్డ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయట తనపై వచ్చే విమర్శలు, చర్చలను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా ఆటపైనే దృష్టి పెడతానని తెలిపారు.

విమర్శలు, చర్చలు లేకపోతే ఆటలో మజా ఉండదని రోహిత్ తనదైన శైలిలో స్పందించారు. ఆటగాళ్లపై చర్చ జరగడం సహజమేనని, అయితే తాను మాత్రం వాటి గురించి ఆలోచించకుండా తన ఆటను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెడతానని చెప్పారు.

మరోవైపు విరాట్ కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుందని రోహిత్ తెలిపారు. ఇద్దరూ తమ ఆలోచనలను పరస్పరం పంచుకుంటూ మంచి భాగస్వామ్యాలు నిర్మించడం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News